తాండూరు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకంలేదని.. 63 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది ‘సిద్దిపేట’ వైపు (హరీష్‌రావు వైపు) ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరులో విలేకరులతో మాట్లాడారు.
ఏ క్షణంలోనైనా తన ముఖ్యమంత్రి కుర్చీకి ముప్పు ఏర్పడుతోందని భయపడే కేసీఆర్ వలసలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తమ పదవులు పోతాయనే భయంతో కొందరు మంత్రులు కూడా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి బతిమిలాడి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. తీగల కృష్ణారెడ్డి వంటి వారు వెళ్తే పార్టీకి ఏం కాదని, వెళ్లిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొరతకు కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు

0 comments:
Post a Comment