కర్నూలు: కర్నూలు నగరంలోని జేఎంజే స్కూల్ లో శనివారం దారుణం చోటు చేసుకుంది. అయ్యప్ప మాలతో స్కూల్ కి వచ్చిన ఓ విద్యార్థినిపై టీచర్ తన ఆగ్రహన్ని ప్రదర్శించింది. ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని రావాలంటూ హుకుం జారీ చేశారు. అందుకు విద్యార్థి ససేమిరా అనటంతో టీచర్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో బెత్తం తీసుకుని విద్యార్థిని చితక బాదింది. విద్యార్థి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపారు.
దాంతో తల్లిదండ్రులు, వీహెచ్ పీ నేతలతోపాటు కార్యకర్తలు స్కూల్ కు చేరుకుని... క్షమాపణలు చెప్పాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో తరగతి గదులలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జేఎంజే స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
0 comments:
Post a Comment