న్యూఢిల్లీ: భారత్ లోని 6758 ఏ4 సెడాన్ కార్లను రీకాల్ చేయాలని లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ ఆడి నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2014 సంవత్సరాల మధ్య ఉత్పత్తి చేసిన కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్టు ఆడీ కంపెనీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేయడం కోసమే తప్ప.. ఎలాంటి పరికరాలను మార్చబోమని ఆడి తెలిపింది. ఆడీ ఏ4 కార్ల వినియోగదారులకు డీలర్లు అందుబాటులో ఉంటారని, సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం అపాయింట్ మెంట్ తీసుకుంటారని ఆడి తెలిపింది.
0 comments:
Post a Comment