న్యూయార్క్: న్యూయార్క్ వీధుల్లో మహిళలపై వేధింపుల నేపథ్యంతో తీసిన వీడియో ఇంటర్నెట్ లో దూమారం రేపుతోంది. రెండు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియో ఘటన అమెరికా మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడమే కాకుండా మైనారిటీలు, మహిళ సంఘాలు నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
జీన్స్, టీషర్టు ధరించి మాన్ హట్టన్ వీధుల్లో పది గంటల పాటు నడిచి వెళ్తున్న నటి శోషానా బి. రాబర్ట్స్ వీడియోను హోలాబ్యాక్ ఛారిటీ కోసం షూట్ చేశారు. ఈ వీడియోలో కొంత మంది యువకులు శోషానాను 'హే బేబీ', హే, బ్యూటిఫుల్ అంటూ వేధించడం లాంటివి షూట్ చేశారు.
పదిగంటల్లో సుమారు 100 మంది యువకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా శోషానా పెద్దగా స్పందించకుండా నవ్వుతో మందలించడం లాంటి సన్నివేశాలు వీడియోలో కనిపిస్తాయి. మంగళవారం యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియోను 9.8 లక్షల మంది చూడటం విశేషం. వీడియో చూసిన కొంతమంది ఆన్ లైన్ లో తనపై బెదిరింపులకు పాల్పడినట్టు శోషానా ఫిర్యాదు చేశారు.
ఈ మెయిల్స్ లో కొంత మంది ప్రశంసించగా, మరికొంత మంది చంపుతామని బెదిరించారు. ఈ బెదిరింపుల కారణంగా తాను అభద్రతాభావానికి లోనవుతున్నానని.. ఈ సంఘటనల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని శోషానా వెల్లడించింది. స్వలింగ సంపర్కులు, నల్లజాతివారి నుంచి ఎక్కువగా వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపింది.
0 comments:
Post a Comment