నాగ్... నాగచైతన్య... పేరుకే ఫాదర్ అండ్ సన్!
తీరుకి ఇద్దరూ క్లోజాతి క్లోజ్ ఫ్రెండ్స్!
లవ్, రొమాన్స్, రిలేషన్స్... మ్యారేజ్, ఫ్రీడమ్, ఇమేజెస్...
మూవీస్, ఫుడ్ హ్యాబిట్స్, ట్రెడిషన్స్...
ఇలా ఏ టాపిక్ అయినా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా...
థాట్స్ షేర్ చేసుకుంటారు.
ఈ ‘నాగ’ ద్వయం ఎక్స్‌క్లూజివ్‌గా ‘సాక్షి’కి చెప్పిన కబుర్లు వింటే...
డెఫినెట్‌గా మీరూ లైక్ చేస్తారు.
మీ నాన్న గారికి, ఆ తరువాత మీకు రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉంది. చాలా సినిమాల్లో ఎందరో అందమైన భామల వెంట మీరు పడ్డారు. అది బాక్సాఫీస్ సక్సెస్ సూత్రమైంది. ఇప్పుడు ‘ఒక లైలా కోసం’లో మీ చైతన్య కూడా అదే బాటలో వెళ్లారు. ప్రేమిస్తున్న అమ్మాయిల వెంటపడే విషయంలో మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్?
నాగ్ (నాగార్జున): నేను చాలా సినిమాలు చేశాను. నాకే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ (నవ్వు). నా మొదటి ఆరేడు సినిమాల్లో నాకు హీరోయిన్ వెంటపడే సీన్లు పెద్దగా లేవు. ‘ఆఖరి పోరాటం’లో మాత్రం నాకు కొన్ని సీన్లు ఉన్నాయి. ‘నిర్ణయం’లో హీరోయిన్ వెంట బాగా పడతాను. చై (నాగచైతన్య) అయితే ‘ఏమాయ చేశావె’ నుంచి ‘ఒక లైలా కోసం’ వరకూ వెంటపడుతూనే ఉన్నాడు. ఆ విషయంలో నా శైలిలో నేను, తన శైలిలో తను సూపర్.
చై (నాగచైతన్య): నా దృష్టిలో నాన్న బెస్ట్. ‘హలో బ్రదర్’ సినిమాలో ఆయన చేసిన సందడి ఎప్పటికీ మర్చిపోలేను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అది.
అసలు అమ్మాయిల వెంటపడటం అనే కాన్సెప్ట్ సినిమాలపరంగా కావచ్చు... వ్యక్తిగతంగా కావచ్చు... మీకెంత వరకు నచ్చుతుంది?
నాగ్: మా సంగతెలా ఉన్నా అబ్బాయిలు వెంటపడితే అమ్మాయిలకు మాత్రం నచ్చదా చెప్పండి! వెంటపడినప్పుడు చూసీ చూడనట్లు ఉంటారు. చిరుకోపాలు ప్రదర్శిస్తారు. కానీ.. లోపల మాత్రం ఆనందపడిపోతారు. అందులో డౌటే లేదు. అప్పట్లో నేనూ కొంతమంది వెంటపడ్డాను. అదో మజా.
చై: డెఫినెట్‌గా కొంచెం థ్రిల్ ఉంటుంది. కానీ, దేనికైనా ఒక హద్దు ఉండాలి. అది దాటితే మాత్రం బాగుండదు. అమ్మాయి ‘నో’ అంటే.. తన అభిప్రాయాన్ని గౌరవించి వదిలేయాలి. కానీ, అమ్మాయి పాజిటివ్‌గా స్పందిస్తే.. వెంటపడడంలో తప్పు లేదు. నా స్కూల్ డేస్‌లో కొంతమందిని ఫాలో అయ్యేవాణ్ణి. ఎవరైనా అమ్మాయి నచ్చితే చాలు.. తను వీకెండ్‌లో ఎక్కడికెళుతుందో తెలుసుకుని అదే కాఫీ షాప్‌కి వెళ్లేవాణ్ణి. తనేదైనా సినిమాకి వెళుతోందని తెలిస్తే.. ఆ థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. అయితే అన్నీ సరదా కోసమే.
అప్పట్లో మీ నాన్నగారు నటించిన రొమాంటిక్ మూవీస్‌లో మీకేది ఇష్టం?
నాగ్: 1960, ’70లలో నాన్నగారు చేసిన రొమాంటిక్ మూవీస్ ఇష్టం. ప్రత్యేకించి ఒక్కటని చెప్పలేను. ఆస్తిపరులు, అంతస్తులు, ఇల్లరికం, డాక్టర్ చక్రవర్తి.. ఇలాంటివన్నీ నాకు బాగా ఇష్టం. జస్ట్ అమ్మాయిల వెంటపడటం అని కాకుండా కథాబలం ఉన్న రొమాంటిక్ మూవీస్ అవి.
చై: ‘మనం’ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో శ్రీయ ఎవరో తెలుసుకోవడానికి నాన్న వెతుక్కుంటూ గ్రామానికి వెళ్లిన ఎపిసోడ్ నాకు బాగా ఇష్టం. అది చాలా రొమాంటిక్‌గా అనిపిస్తుంది. అలాగే, ‘గీతాంజలి’ నాకు చాలా చాలా ఇష్టం. అది మంచి రొమాంటిక్ మూవీ.
‘ఒక లైలా కోసం’లో ఓ నక్షత్రానికి హీరోయిన్ పేరు పెట్టి, హీరో ‘ఇదే బెస్ట్ గిఫ్ట్’ అంటాడు. ఒకవేళ పర్సనల్‌గా అమ్మాయిలకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటే మీరేం ఇస్తుంటారు?
నాగ్: ఆ సినిమాలో హీరోయిన్‌కి హీరో ఇచ్చినది బెస్ట్ గిఫ్ట్ అని నేనను కానీ.. కచ్చితంగా వినూత్నమైన గిఫ్ట్. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ఈ సీన్ గురించి చెప్పగానే ‘ఇలా నక్షత్రాలకు పేరు పెట్టొచ్చని, దానికి సంబంధించిన ఏజెన్సీ నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు’ అని తెలిసింది. అసలు ఎవరూ ఊహించని గిఫ్ట్ అది. ఏ అమ్మాయికైనా నచ్చుతుంది. ఈ సినిమా మొత్తం విజయ్‌కుమార్ చాలా బాగా తీశాడు. ఇలాంటి సీన్‌ను ఎవరూ ఊహించరు. ఇక, వ్యక్తిగతంగా నేనిచ్చే బహుమతులంటారా? ఎప్పుడో జరిగాయి.. మర్చిపోయాను (నవ్వుతూ)... ఇప్పుడెవరికీ ఇవ్వడం లేదు. ఈ ప్రశ్న చై లాంటి కుర్రాళ్లను అడగాలి. ఇప్పుడు నేనేదైనా ఇవ్వాలనుకుంటే అమలకే ఇస్తుంటాను. అదీ తనను అడిగి, ఏది ఇష్టపడితే అది ఇస్తుంటాను.
చై: సినిమాటిక్‌గా చూస్తే.. ఒక నక్షత్రాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడమనేది కొత్త పాయింట్. ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారు. నిజజీవితంలో మనతో పాటు ఉండే అమ్మాయి హ్యాపీగా ఉండేలా చేయడమే మంచి బహుమతి.
నాగార్జునగారూ.... చైతూ వయసులో మీరున్నప్పుడు.. ‘చుక్కల్లో చంద్రుడు’ అనే తరహా ఇమేజ్ ఉండేది.. మీతో పోల్చుకుంటే చైతూనే గుడ్ బోయ్ ఏమో!
నాగ్: మీరూ, నేను చైతూ గురించి అలానే అనుకుంటాం. వెనకాల ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు (నవ్వుతూ). చై గురించి అఖిల్ నాకు ఇన్‌ఫర్మేషన్ ఇస్తుంటాడు. అప్పుడు వేరే కథలు వినిపిస్తుంటాయి.
చై: ఏం చెప్పాలో తెలియడం లేదండి (నవ్వేస్తూ)...
అప్పట్లో మీ నాన్నగారి దగ్గర చెప్పి, ధైర్యంగా లవ్ మేరేజ్ చేసుకున్నారు మీరు (నాగ్).. ఇప్పుడు మీ అబ్బాయికి ఆ స్వేచ్ఛ ఇస్తారా? ఒకవేళ మీరు (చైతూ) లవ్‌లో పడితే ఆ విషయాన్ని మీ నాన్న గారి దగ్గర ధైర్యంగా చెప్పగలుగుతారా?
నాగ్: వాస్తవానికి ఇప్పటి తరం తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నంత ఓపెన్‌గా అప్పటి తరం వాళ్లు ఉండేవాళ్లు కాదు. కానీ, మా నాన్నగారు ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను గౌరవించే మనిషి కాబట్టి, మాకేదైనా చెప్పే స్వేచ్ఛ ఉండేది. మా అబ్బాయిలు నా దగ్గర ఏదైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు చై వచ్చి ‘నాన్నా.. ఆ అమ్మాయి అంటే ఇష్టం. పెళ్లి చేసుకుంటా’ అంటే ‘ఓకే’ అంటా. మీకో విషయం చెప్పనా? మా ఇద్దరి పిల్లలకు ‘మంచి అమ్మాయిని చూసుకుని, మీరే పెళ్లి చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు’ అని చెప్పా.
చై: నాన్న చాలా ఫ్రెండ్లీ. ఏదైనా చెప్పుకునేంత స్వేచ్ఛ ఉంటుంది. అంత ఫ్రీగా ఉంటారు కాబట్టే, ఏ విషయాలూ దాచుకోకుండా చెప్పేస్తా!
‘మనం’ సినిమాలోలాగా మందు కొట్టి, ఎంజాయ్ చేసేంత ఫ్రెండ్లీగా ఉంటారా?
నాగ్: ఇద్దరూ కలిసి మందు కొడితేనే ఫ్రెండ్లీగా ఉన్నట్లు కాదు. నా లెక్క ప్రకారం మందు కొట్టి, మాట్లాడుకోవడం అనేది గొప్ప స్నేహం కాదు. ఏ సమయంలో అయినా మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడుకోవడం గొప్ప స్నేహం. మా మధ్య అలాంటి స్నేహమే ఉంది.
ప్రేమ గురించి ఏం చెబుతారు?
నాగ్: ప్రేమ విశ్వవ్యాప్తంగా ఉంది. ఏ వ్యక్తి అయినా తన జీవిత కాలంలో ప్రేమను అనుభవించకపోతే.. అతని జీవితం అసంపూర్ణం అనే చెబుతాను. ఆ ప్రేమ ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు. మరికొంత మంది ప్రకృతిని ప్రేమిస్తారు. ఇలా దేన్నయినా ప్రేమించవచ్చు. కానీ, ప్రేమించడం అనేది తెలియాలి.
చై: ప్రేమ అనేది చాలా ముఖ్యం. మన శరీరంలో బ్లడ్ ఎలా ఉంటుందో, ప్రేమ కూడా అలా ఉండాలి. ఒక మనిషి ఆనందంగా జీవించడానికి ప్రేమ చాలా అవసరం.
పెళ్లి గురించి మీ ఇద్దరి అభిప్రాయాలేమిటి?
నాగ్: ఒక తోడు ఉంటే జీవితం ఎంత బాగుంటుందో, నిండుగా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ తోడు చైకి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లనేది ఒక గొప్ప బంధం. పెళ్లి వయసొచ్చినప్పుడు, ఆ తోడును తెచ్చుకోవాలి. అలాగని, నేనేం ఒత్తిడి చేయడం లేదు. ఏదైనా తన ఇష్టప్రకారమే!
చై: పెళ్లనేది జీవితానికి చాలా ముఖ్యం. ఎవరైనా సరే కెరీర్‌లో సెటిలైన తర్వాత పెళ్లి చేసుకోవాలంటారు. ఆ సంగతి పక్కనపెడితే ప్రతి ఒక్కరికీ జీవిత భాగస్వామి అవసరం. అప్పుడే జీవితం పరిపూర్ణంగా ఉంటుందని నా నమ్మకం. పెళ్లి వాయిదా వేయాలని నాకూ లేదు. ఐయామ్ రెడీ!
చైతూ రెడీ అంటున్నారు.. ఇక మీదే ఆలస్యమేమో నాగార్జున గారూ! చైతన్యా.. మరి, మీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పడానికి ఇది కరెక్ట్ సమయమేమో?
నాగ్: ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. నాకు నేనుగా సంబంధాలు వెతకడం లేదు కానీ, చాలామంది అడుగుతున్నారు. నేను చైతోనే మాట్లాడమన్నాను. తనకు ఓకే అంటే నాకు ఓకే. ఇప్పుడు చేసుకుంటానంటే చేయడానికి నేను రెడీ!
చై: ఎవరైనా ఉంటే.. ఎప్పుడో చెప్పేసేవాడినండి. నాన్న దగ్గర ఆ మాత్రం చనువు ఉంది.
సంప్రదాయాలకు మీరెంత విలువనిస్తారు?
నాగ్: నేను చాలా గౌరవిస్తాను. వాస్తుని నమ్ముతాను. అంతెందుకు... హిందువులకు ఆవు దైవం వంటిది. అందుకే గృహప్రవేశం అప్పుడు గోమాతను ఇంటి చుట్టూ తిప్పుతారు. కాస్మిక్ రేస్‌ను అన్నిటికన్నా ఆవు ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తుందట. అందుకే అప్పట్లో గర్భవతులు ఆవు పక్కన పడుకునేవారట. కడుపులో ఉన్న బిడ్డకు ఆ కిరణాలు సోకుతాయని నమ్మకం. ఎవరైనా ఇలాంటివన్నీ చెబితే.. అంతా ట్రాష్ అనుకోను. బలంగా నమ్ముతాను.
చై: చిన్నప్పుడు లెక్క చేయలేదు. ఇప్పుడా విలువ తెలుస్తోంది. గుడ్డిగా నమ్మను కానీ, ఈ ఆచారాలకు ఓ కారణం ఉంటుందని నమ్ముతాను.
మీ తరంలో అమ్మానాన్నలతో అనుబంధం, ఈ తరం పిల్లలతో అమ్మానాన్నలకు ఉన్న అనుబంధంతో పోల్చితే ఏం చెబుతారు?
నాగ్: మా తరంతో పోల్చుకుంటే ఈ తరం బాగుంది. ఎందుకంటే, మా తరంలో తల్లిదండ్రులు, పిల్లలు అంత స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్లు కాదు. అప్పట్లో పిల్లలంటే అయితే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజినీర్ కావాలి. ‘నీకు డాక్టర్ చదవాలని ఉందా? ఇంజినీర్ చదవాలని ఉందా?’ అని నాన్న అడిగితే, మరో మాట మాట్లాడకుండా నేను ఇంజినీరింగ్ చదివేశాను. అంతేకానీ ఇష్టంతో కాదు. రాను రానూ నాన్న ఓపెన్‌గా మాట్లాడటం మొదలుపెట్టారు. మొదటి నుంచీ ఇలా ఉంటే బాగుండేది కదా అనిపించేది.
చై: ఒక డిగ్రీ ఉండాలని నాన్నగారు అన్నారు. అందుకని బీకామ్ చేసేశాను. నాన్న, మేము చాలా ఫ్రీగా మాట్లాడేసుకుంటాం. కాబట్టి, ఎప్పుడూ నాన్న దగ్గర ఏదీ దాచినట్లుగా నాకు అనిపించదు.
పండగలు ఎలా చేసుకుంటారు?
నాగ్: మొత్తం కుటుంబం అంతా కలిసి చేసుకోవడం అలవాటు. గత ఏడాది దీపావళికి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. కానీ, మనిషి ఉన్నారనే సంతోషం ఉండేది. ఈ ఏడాది ఆయన లేరు. అందరం కలిసి దీపాలు వెలిగించేటప్పుడు ‘అమ్మా నాన్న లేరే’ అనిపించింది. సంక్రాంతి నాడు నాన్నగారు మొత్తం అన్నపూర్ణ స్టూడియో ఉద్యోగులందర్నీ పిలిచి, సెలబ్రేట్ చేసేవారు. మేం కూడా దాన్ని పాటించాలనుకుంటున్నాం.
చై: నాకూ పండగలంటే ఇష్టమే.
మీ ఇద్దరి బలం?
నాగ్: మన కోసం ఒకరున్నారనే బలం మనల్ని ముందుకు నడిపించేస్తుంది. మనకు ఎవరూ లేరనే ఫీలింగ్ వెనకబడేలా చేస్తుంది. నాకేదైనా జరిగితే నా పిల్లలున్నారనే ఫీలింగ్ నాకు కొండంత బలాన్నిస్తుంది.
చై: ఏం జరిగినా ఫరవాలేదు.. నాన్న ఉన్నారు అనే ఫీలింగే బలం. నా వెనకాల నాన్న ఉన్నారనే ధైర్యం ఎంత బలాన్నిస్తుందో మాటల్లో చెప్పలేను.
- డి.జి. భవాని
శని, ఆదివారాల్లో నచ్చినవన్నీ తింటా - నాగచైతన్య
నాగ్: ఎవరికైనా సరే 40, 45 ఏళ్లు దాటిన తర్వాత జీర్ణశక్తి తగ్గుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకుంటాను. జంక్ ఫుడ్ జోలికి వెళ్లను. పాల ఉత్పత్తులు తీసుకోను. ఒక వయస్సు తర్వాత అవి మంచిది కాదు. అందుకే ఎప్పుడో ఒకసారి తప్ప పెరుగు తినను. పైగా, ఇప్పుడొచ్చే పాలల్లో ఏం కెమికల్స్ ఉంటాయో తెలియడం లేదు. నలభైలలో పాలు మానేస్తే చాలా సమస్యలు తగ్గుతాయి.
చై: బేసిక్‌గా నేను ఫుడ్ లవర్‌ని. ‘స్వీట్ టూత్’ అంటారు కదా... అదన్న మాట! చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ అన్నీ తింటాను. కానీ, ఎన్ని కేలరీలు లోపలికి వెళతాయో తెలుసుకుని, శరీరానికి కావల్సినవి ఉంచేసుకుని, మిగతావి ఎక్సర్‌సైజ్‌ల ద్వారా కరిగించేస్తాను. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలా ఉన్నా.. శని, ఆదివారాల్లో మాత్రం అన్నీ మర్చిపోతాను. నచ్చివన్నీ హ్యాపీగా తినేస్తాను.

0 comments:
Post a Comment