న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలతో ముంచెత్తారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్పూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్పూర్తిగా నిలుస్తాయని మోడీ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ మంగళవారం ముంబైలోని కజ్రాత్ ప్రాంతంలో క్లీనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తన ఫేస్ బుక్ లోని ఫ్యాన్స్, తన ట్విటర్ అకౌంట్ లోని ఫాలోవర్స్ తోపాటు, అమీర్ ఖాన్, అజీమ్ ప్రేమ్ జీ, చందా కొచ్చర్, ఒమర్ అబ్దుల్లా, ప్రదీప్ దూత్, రజత్ శర్మ, రజనీకాంత్, వినీత్ జైన్ లను నామినేట్ చేశారు.
0 comments:
Post a Comment