గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ రూట్ మార్చినట్లు సమాచారం. రొటీన్ మాస్ సినిమాలను పక్కన పెట్టేసి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెరపై కనిపించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో భాగంగా ఇటీవల దర్శకుడు క్రిష్ చెప్పిన ఓ సబ్జెక్టు ను ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాలో బిజీగా వున్న ఎన్టీఆర్, ఆ తరువాత సుకుమార్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత క్రిష్ మూవీ సెట్స్ పైకి వెళుతుందట. క్రిష్ ఇప్పుడు బాలీవుడ్‌లో ‘గబ్బర్' చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టాలని క్రిష్ అనుకున్నట్లు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. అంతా ఓకే అయితే.. వీళ్ల కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ పట్టాలకెక్కనుంది.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment