Total Pageviews

మామ తర్వాతే అల్లుడు

మామ తర్వాతే అల్లుడు
మామ చిత్రం తర్వాతే అల్లుడు వస్తాడట. అందుకే అల్లుడి చిత్రం పూర్తి అయినా, మామ చిత్రం కోసం వెయిటింగ్‌లో పెడుతున్నారట. ఈ మామ అల్లుళ్లు ఎవరంటే, సూపర్‌స్టార్ రజనీకాంత్, ధనుష్. మామ నటిస్తున్న తాజా చిత్రం లింగా, అల్లుడు చిత్రం అనేగన్. ధనుష్ హీరోగా నటిస్తున్న అనేగన్ చిత్రంలో అమిర దస్తర్ హీరోయిన్. కెవి ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే రజనీకాంత్ నటిస్తున్న లింగా చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న తెరపైకి తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ముందే ప్రకటించడంతో ఆ చిత్రం తర్వాతనే ధనుష్ చిత్రాన్ని  విడుదల చేయాలని చిత్ర నిర్మాతల వర్గం భావిస్తోందట.

 లింగా చిత్రంలో రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హాలు రొమాన్స్ చేస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో లింగా చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే లింగా చిత్రానికి ముందుగా అంటే  నవంబర్ చివరిలో విక్రమ్ నటించిన మరో భారీ బ్రహ్మాండ చిత్రం ఐ తెరపైకి రానుంది. ఎమి జాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో పెద్ద చిత్రం విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏ క్లాస్ థియేటర్లన్నీ లింగా, ఐ చిత్రాలే ఆక్రమిస్తాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అనేగన్ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
Share on Google Plus

About nellore people puls

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment