‘‘అర్జున్ దర్శక, నిర్మాతల హీరో. తనతో ఐదు సినిమాలు చేశాను. ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రం ద్వారా అర్జున్‌ని నేను పరిచయం చేసినప్పుడు తను గొప్ప నటుడవుతాడని, పైకొస్తాడని అనుకున్నా. అది నిజమైంది. నటుడిగానే కాకుండా మంచి దర్శక, నిర్మాత అని కూడా అనిపించుకున్నాడు’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పారు. అర్జున్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జై హింద్ 2’. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న కోడి రామకృష్ణ బిగ్ సీడీని ఆవిష్కరించారు.
ఆడియో సీడీని నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించి, నటుడు బ్రహ్మానందంకి ఇచ్చారు. అర్జున్ మాట్లాడుతూ- ‘‘ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్న నారాయణ్ కృష్ణన్‌గారు ఉద్యోగాన్ని వదిలేశారు. సమాజ సేవ చేయాలనే ఆకాంక్షతో ఆక్షయ ట్రస్ట్ ప్రారంభించారు. ఆయన రియల్ హీరో అనిపించి, ఈ వేడుకకు పిలిచాం. ఈ చిత్రం కూడా సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంలో సాగే చిత్రం. అర్జున్ జన్యా మంచి పాటలు స్వరపరిచారు. నా గత చిత్రాల్లోని ఫైట్స్ అన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రంలోని ఫైట్స్ అన్నీ మరో ఎత్తు’’ అని చెప్పారు. ఈ వేడుకలో మురళీమోహన్, బీవీయస్‌యన్ ప్రసాద్, సి. కల్యాణ్, ‘దిల్’ రాజు, బ్రహ్మానందం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఐశ్వర్య, అంజన.

0 comments:
Post a Comment