సైమా అవార్డుల కార్యక్రమంలో రానా, త్రిష ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరూ కలసే మలేసియాకు వెళ్లినట్టు సమాచారం. రానా, త్రిష కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం. ఈ జంట ఈ రూమర్లను ఖండించినా.. రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు టాలీవుడ్ కోడైకూస్తోంది. అయితే ఇదంతా గతం. రానా, త్రిష తమ బంధాన్ని తెంచుకున్నట్టు తాజా సమాచారం. రానా వేరే అమ్మాయిలతో ఎఫైర్ సాగిస్తున్నాడనే కారణంతో వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది. రానా, త్రిష ట్విట్టర్ లో పరస్పరం ట్వీట్ చేసుకునేవారు. అయితే కొంతకాలంగా ట్వీట్స్ చేసుకోవడం మానేశారు.
' ఓ కథకు ఎప్పుడూ మూడు కోణాలుంటాయి. నీవైపు, ఎదుటి వారి తరపున వారి వాదనలుంటాయి. నిజమన్నది ఈ రెండింటికీ భిన్నంగా ఉంటుంది" అని ఇటీవల రానా ట్వీట్ చేయగా, 'ఓ వ్యక్తిని మరచిపోవడం సులభం, అయితే మరోసారి ఆ వ్యక్తిని నమ్మడమంటూ ఉండదు" అని త్రిష ట్వీట్ చేశారు. 'నేను బంధాన్ని తెంచుకుంటే, దానికి గల కారణాలను నీవే కల్పించావు' అని త్రిష మరోసారి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ను బట్టి రానా, త్రిషల మధ్య సీక్రెట్ ఎఫైర్ ముగిసిపోయిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
0 comments:
Post a Comment