‘బాహుబలి’ అంటే... రాజమౌళి కలల సినిమా కావచ్చు! అత్యాధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం కావచ్చు! గొప్ప కథకు అతి విలువైన తెరరూపం కావచ్చు! వీటన్నింటి కన్నా ప్రధానమైంది.. ప్రభాస్‌కున్న కొండంత నమ్మకం. ఆయనతో సినిమాలు చేయడానికి బోలెడంత మంది దర్శక, నిర్మాతలు వెయిటింగ్.. మరోపక్క లక్షల కళ్లతో ఫ్యాన్స్ వెయిటింగ్. కానీ ప్రభాస్ కథను నమ్మాడు. దర్శకుణ్ణి నమ్మాడు. ఓ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు ఫలితాన్ని నమ్మాడు. అందుకే ‘బాహుబలి’ చేస్తున్నాడు. ‘మిర్చి’ విడుదలై ఇప్పటికి 20 నెలలైంది. ఈ 20 నెలలు.. ఇంకా మరికొన్ని నెలలు ‘బాహుబలి’ కోసం అంకితం చేశాడు ప్రభాస్. ఆయన నమ్మకం దఫ దఫాలుగా విడుదలవుతున్న టీజర్స్, స్టిల్స్ చూస్తేనే తెలుస్తోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని ‘మిర్చి’లో అన్నట్లుగా, ఈ స్టిల్ చూస్తే ‘బాహుబలి’ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమవుతోంది. నేడు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ సరికొత్త స్టిల్‌ను ఆయన తన అభిమానుల కోసం ప్రత్యేకంగా విడుదల చేశారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment