రెండేళ్లుగా వర్క్ షెడ్యూల్‌తో దీపావళి సెలబ్రేషన్ కుదరటం లేదు. ఈసారి పండుగ కోసం షూటింగ్ కు ఓ రోజు లీవ్ తీసుకుని మరీ ఇంటికెళ్తున్నా. రోజంతా ఫ్యామిలీతోనే గడిపేస్తాను. గతేడాదితో పోలిస్తే ఈసారి దివాలీ నాకు చాలా స్పెషల్. లౌక్యం హిట్, కరెంట్ తీగ సినిమాతో జోష్‌తో ఉన్నా. చిన్నప్పుడు క్రాకర్స్ బాగా కాల్చేదాన్ని. టెన్త్ క్లాస్ నుంచి మానేశాను. దీపాలు, రంగోలీలతో ఇళ్లంతా అలంకరిస్తాను.
సేవ్ అండ్ సేవ
దివాలీ అంటే వెలుగులతో పాటు సంతోషాన్ని పంచడం కూడా. అందుకే పండుగ వేళ సంబరాల కోసం స్పెండ్ చేసే డబ్బులో కొంత చారిటీకి వినియోగిస్తుంటాను. క్రాకర్స్‌పై ఖర్చు మానేసి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని నా ఆలోచన. పండుగకు స్వీట్లూ కొనుక్కోలేని వాళ్లుంటారని, వారి కోసం ఏదైనా చేయగలిగితే బాగుంటుందని చిన్నప్పుడు నాన్న చెప్పిన మాట నచ్చింది. అప్పటి నుంచి నాకు చేతనైన సాయం చేస్తుంటాను.
హెల్పింగ్ నేచర్..
ఈ నాయిస్, పొల్యూషన్ వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగకుండా దీపావళి జరుపుకోవాలి. పెట్స్‌కి, ఆస్పత్రులు, పేషెంట్స్ వున్న చోట వారికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటే అందరికీ హ్యాపీ. సంతోషంగా, సురక్షితంగా పండుగ జరుపుకోవాలి. ఈ పండుగ సందర్భంగా మంచి మనసుతో వైజాగ్ హుదూద్ తుపాను బాధితులకు వీలైనంత సాయం అందిస్తే బాగుంటుంది.
0 comments:
Post a Comment