దేశమంతటా సినిమా రంగంలో ఇప్పుడు ఆ సినిమా కథే హల్ చల్ చేస్తోంది. ఆ చిత్రం మల్లూవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ ప్రేక్షకులతో హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. శాండిల్‌వుడ్‌లో కూడా అదే రిపీట్ అయింది. మూడు భాషలలో విజయం సాధించిన 'దృశ్యం' సినిమా కథ కోలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ కథపైన బాలీవుడ్ కన్నేసింది.
ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ కొడితే చాలు, దానిని అన్ని భాషలలో రీమేక్ చేసేస్తున్నారు. బడా హీరోలు, నిర్మాలు ఆ కథల హక్కుల కోసం బారులు తీరుతున్నారు. 'దృశ్యం' విషయంలో కూడా అదే జరుగుతోంది. మొదట ఈ మూవీని మళయాలంలో మోహన్‌లాల్‌తో నిర్మించారు. అక్కడ ప్రేక్షకులు మెచ్చుకున్నారు. హిట్ కొట్టింది. తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో రీమేక్ చేశారు. అందరికీ నచ్చేసింది. కన్నడంలో రవిచంద్రన్‌తో తెరకెక్కించారు. అక్కడ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం తమిళంలో కమల్ హాసన్ తో రూపొందిస్తున్నారు. దేశంలోని ముఖ్యమైన భాషలలో ఇక హిందీయే మిగిలి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ కూడా ఈ కథను పరిశీలిస్తోంది. 'దృశ్యం'పై బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కన్నేశాడు.

0 comments:
Post a Comment