‘‘ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. విజయ్ నాకో విలువైన బహుమతి ఇచ్చాడు’’ అని అమలాపాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్‌తో కలిసి మకావ్‌లో ఉన్నారు. ఆదివారం తన పుట్టినరోజుని అక్కడే జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమలా పాల్ మాట్లాడుతూ -‘‘కాలం గడిచిపోతున్న విషయమే నాకు తెలియడంలేదు. అంత హాయిగా ఉంది.
ఇప్పుడు నా వయసులో ఓ సంవత్సరం పెరిగింది. ఈ సందర్భంగా విజయ్ నాకో మంచి బహుమతి ఇచ్చాడు. ప్రతి స్త్ర్రీ దాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఈ ఆనందంలో నాకు నోట మాట రావడంలేదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ఉన్నాయి’ అన్నారు. స్త్రీకి విలువైనది అంటే.. ‘మాతృత్వం’. అందుకని అమలాపాల్ దీన్ని ఉద్దేశించే అని ఉంటారని అందరూ ఊహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తమిళ దర్శకుడు విజయ్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే.

0 comments:
Post a Comment