సూపర్‌స్టార్ సూపర్ స్టయిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయి కన్నులతో ‘లింగ’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. చిత్రీకరణ నుంచే అంచనాలు అంబరాన్ని తాకిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్‌తో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి ‘రాక్‌లైన్’ వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తున్నాను అనే ఫీలింగే చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. రజనీ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, నరసింహా చిత్రాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ‘లింగ’ ఫస్ట్‌లుక్‌ని వినాయకచవితి కానుకగా విడుదల చేశాం. దీపావళి కానుకగా మరో లుక్ విడుదల చేశాం. స్పందన అదిరిపోయింది. ఇటీవలే హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో మూడున్నర కోట్ల భారీ వ్యయంతో రజనీ, సోనాక్షి, 200 మంది డాన్సర్లతో ఓ పాట చిత్రీకరించాం.
సూపర్‌స్టార్ అభిమానులు థియేటర్లో విజిల్స్ వేసేలా ఈ పాట ఉంటుంది. ప్రస్తుతం దుబాయ్, మోకా, అబుదాబీల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అబ్రాడ్‌లోనే కొన్ని సాంగ్స్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నాం. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఈ చిత్రానికి మెయిన్ హైలైట్స్. దేశంలోని ఉన్నతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రం పాటలను నవంబర్ రెండో వారం విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.

0 comments:
Post a Comment