Total Pageviews

ఆలస్యం చెయ్యకండి త్వరగా పెళ్లి చేసుకోండి

ఆలస్యం చెయ్యకండి త్వరగా పెళ్లి చేసుకోండి
నన్నడిగితే పెళ్లి చేసుకోమని సలహా ఇస్తానంటున్నారు నటి అమలపాల్. అతి కొద్ది కాలంలోనే నటిగా మంచిస్థాయికి చేరుకున్న ఈమె అతి తక్కువకాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యిపోయారు. కోలీవుడ్‌లో అతి తక్కువ చిత్రాలు చేసి ఎక్కువ ప్రాచుర్యం పొందిన తార అమలాపాల్. దర్శకుడు విజయ్‌ను జీవిత భాగస్వామిగా చేసుకొని సంతోషంగా ఉన్నానంటున్న ఈ ముద్దుగుమ్మ వివాహానంతరం తొలి పుట్టిన రోజును ఆదివారం భర్తతో కలిసి మకావ్‌లో జరుపుకుంది. వివాహ జీవితం ఆనందంగా ఉందంటున్న ఈ బ్యూటీతో చిన్న ఇంటర్వ్యూ.

ఈ మధ్య స్లిమ్‌గా తయారయ్యిన్నట్లున్నారు?
మలయాళ చిత్రం లైలా ఓ లైలా చిత్రం కోసమే ఇలా తయారయ్యాను. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో పాత్రను ఒక సవాల్‌గా భావించాను. చాలా శిక్షణ పొందాను, మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని టైటిల్ పాట కోసం చాలా స్ట్రిక్ట్‌గా డైట్ చేశాను. చిత్రానికీ పాట టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందన్నమాట. అందుకే ఈ పాట కోసం బరువు తగ్గాను. ఇక స్లిమ్‌గా తయారయ్యానంటే నా శిక్షకుడు షైనేకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఈ చిత్రంలో నా పాత్ర రెండు మూడు వేరియేషన్‌లతో చాలా కొత్తగా ఉంటుంది. లైలా ఓ లైలా చిత్రంలో మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన పాత్ర నాది. ఈ చిత్రంతో పాటు మిల్లి అనే మరో మలయాళ చిత్రం చేస్తున్నాను.

 వివాహానంతరం నటించాలనుకుంటున్నారటగా?
ముందుగా ఒక్క విషయం స్పష్టం చేయూలి. నా కిప్పుడు పలు చిత్రాలు చెయ్యాలని, డబ్బు సంపాదించాలని, పేరు తెచ్చుకోవాలని గానీ లేదు. మంచి కథా పాత్రలు వస్తే చెయ్యడానికి సిద్ధమే అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను.

మిల్లి చిత్రంలో డీగ్లామర్ పాత్ర పోషించడం గురించి?
మిల్లి చిత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలోని నాయకి పాత్రను నా వ్యక్తిగత జీవితానికి ఆపాదించుకోలేను కానీ మిల్లి పాత్రలోని చాలా లక్షణాలు నాలో ఉన్నాయనిపిస్తోంది. చిత్ర షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ పాత్ర చాలా భిన్నంగా ఉందనే భావక కలిగింది.

మకావ్‌లో భర్తతో కలిసి తొలి పుట్టిన రోజు జరుపుకున్నారట?
రెండు మలయాళ చిత్రాల వరుస షూటింగ్‌లతో నేను చాలా అల సిపోయాను. అలాంటి సమయంలో విజయ్ నా పుట్టిన రోజు సందర్భంగా నాకిచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఈ విహారయాత్ర. వివాహానంతరం జరుపుకున్న తొలి పుట్టిన రోజు మధుర మైన అనుభవంగా మిగిలిపోతుంది.ఇంతకుముందెప్పుడు ఇంత ఆనందం పొందలేదు. విజయ్‌తో కలిసి జరుపుకున్న ఈ పుట్టినరోజు జాయ్‌ఫుల్‌గా ఉంది.

వైవాహిక జీవితం ఎలా సాగుతోంది?
బ్యూటీఫుల్. చాలా సంతోషంగా సాగుతోంది. పెళ్లికాని వారిని పెళ్లి చేసుకోమని సిఫార్సు చేస్తాను కూడా. మీ జీవిత భాగస్వామిని కనుక మీరు నమ్మితే మీ జీవితం స్వర్ణమయమే. ఆలస్యం చెయ్యకండి త్వరగా పెళ్లి చేసుకోండి అని సలహా ఇస్తాను. నా భర్త విజయ్ ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడు, ప్రియుడు. నా  జీవితంలో ఆనందం నిండుగా ఉంది.
Share on Google Plus

About nellore people puls

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment