రాజకీయాల నుంచి కాస్త విశ్రాంతి దొరకటంతో చిరంజీవి సినిమాలపై.. అందునా తన 150వ సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా తన స్వీయదర్శకత్వంలో ఆ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాగా చిరంజీవి 150 సినిమాకి డైరెక్టర్ గా చాలామంది పేర్లు తెర మీదకు వచ్చాయి.
ఛాన్స్ ఇస్తే చిరు సినిమాకు దర్శకత్వం వహిస్తానని దర్శకుడు వీవీ వినాయక్ బాహాటంగానే చెప్పాడు. కానీ చిరంజీవి మాత్రం స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నారట. నలభై ఏళ్ల తన నటనా అనుభవంతో ఆయన మెగాఫోన్ పట్టుకునేందుకు డిసైడ్ అయ్యారట. తాను నటించి దర్శకత్వం వహిస్తే భారీ క్రేజ్ వస్తుందని కూడా చిరు భావిస్తున్నారట. కాగా చిరంజీవి దర్శకత్వంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
0 comments:
Post a Comment