మాడ్రిడ్: ఫుట్ బాల్ స్టార్ జినెదిన్ జిదానే పై స్పానిష్ పుట్ బాల్ ఫెడరేషన్ మూడు నెలల సస్పెన్షన్ వేటు విధించింది. సరైన అర్హత లేకుండా రియల్ మాడ్రిడ్ కాస్టిల్లా జట్టుకు కోచ్ గా వ్యవహరించినందుకు వేటు వేశారు. కోచ్ లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సెనేఫ్ ఎస్కులాస్ డైరెక్టర్ మిగ్యుల్ గలాన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా జిదానేపై చర్య తీసుకున్నారు.
కోచ్ గా జిదానేకు స్పానిష్ ఫుట్ బాల్ అసోసియేషన్ లో లెవల్ 3 క్వాలిఫికేషన్ లేదని, కేవలం యూఈఎఫ్ఏ లైసెన్స్ మాత్రమే ఉందని మిగ్యుల్ గలాన్ ఫిర్యాదు చేశారు. యూఈఎఫ్ఏ లైసెన్స్ తో రియల్ మాడ్రిడ్ కాస్టిల్లా జట్టుకు కోచ్ గా వ్యవహరించడానికి అనర్హుడని ఆయన అన్నారు. అయితే రియల్ మాడ్రిడ్ జట్టు యాజమాన్యం మిగ్యుల్ గలాన్ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
0 comments:
Post a Comment