Total Pageviews

నక్షత్రంపై భారీ పేలుడు

నక్షత్రంపై భారీ పేలుడు
మనకు 14,800 కాంతి సంవత్సరాల దూరంలో.. తిమింగలం(డెల్ఫినస్) నక్షత్రరాశిలో ఉన్న ఓ శ్వేత మరుగుజ్జు నక్షత్రంపై భారీ పేలుడు(నోవా) సంభవించిందట. ఈ విస్ఫోటనం వల్ల ఏర్పడిన నిప్పుల గోళం సెకనుకు 600 కి.మీ. వేగంతో కొన్ని రోజుల్లోనే ఏకంగా.. మన సౌర కుటుంబం అంత సైజుకు విస్తరించిందట! సూర్యుడి అంత ద్రవ్యరాశితో ఉన్న ఓ నక్షత్రం భూమి సైజుకు దట్టంగా కుదించుకుపోయి ఇలా శ్వేత మరుగుజ్జు నక్షత్రంగా మారింది. పక్కనే ఉన్న మరో నక్షత్రం నుంచి హైడ్రోజన్ వాయువులను లాగేసుకోవడంతో ఈ శ్వేత నక్షత్రం ఉపరితలంపై హైడ్రోజన్ భారీగా పెరిగి చివరికిలా అనూహ్య పేలుడు సంభవించింది.

ఇండియన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్త దీపాంకర్ బెనర్జీ, జపాన్ పరిశోధకుల బృందం దీనిని గత ఆగస్టులో కనుగొంది. అయితే, వీరు తాజాగా ఈ నక్షత్రంపై పేలుడును స్పష్టమైన చిత్రాలుగా రూపొందించి విడుదల చేశారు. విశ్వంలో ఇలాంటి పేలుడును ఇంత స్పష్టంగా, అది జరిగిన 15 గంటలకే గుర్తించడం ఇదే తొలిసారి
Share on Google Plus

About nellore people puls

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment