నటుడు ధనుష్‌తో చెన్నై చిన్నది త్రిష జోడి కట్టనుందని ప్రస్తుతం కోలీవుడ్ టాక్. వీరు చిత్ర రంగ ప్రవేశం చేసి దశాబ్ద కాలం దాటింది. వీరిద్దరి మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కూడా. అయిన ఈ జంట ఇప్పటి వరకు ఒక్క చిత్రంలో కూడ కలిసి నటించకపోవడం విశేషమే. అయితే వీరిద్దరినీ కలిపి చిత్రం చెయ్యాలని ఇంతకుముందు కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా అది జరగలేదు. ధనుష్‌కు జంటగానే ఇంతకుముందు దర్శకుడు వెట్రిమారన్ ఆడుగళం చిత్రానికి ఎంపిక చేశారు. ఈ చిత్రంలో త్రిష కొన్ని రోజులు నటించింది. అయితే కారణాలు ఏవైనా ఈ చిత్రం నుంచి ఈ బ్యూటీ వైదొలగింది.
ఆ తర్వాత ఆ పాత్రను నటి తాప్సీ పోషించింది. ఆ చిత్రంతో ధనుష్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కూడా పొందారు. ఇటీవల ధనుష్, త్రిష పబ్‌లో కౌగిలింతల ఫొటోలు సోషల్ నెట్‌వర్క్‌లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం హోరెత్తింది. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక చిత్రంలో జత కట్టనున్నారనే ప్రచారం మొదలైంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు వేల్‌రాజ్ దర్శకుడిగా మారి ధనుష్ హీరోగా వేలై ఇలాద పట్టాదారి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం విశేష ప్రజాదరణతో శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. వేల్‌రాజ్ తన తదుపరి చిత్రానికి కూడ ధనూష్‌నే కథానయకుడిగా ఎంచుకున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను కూడా ఆయనకు వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందారు. అయితే ఈ చిత్రంలో పెరియాళన్ చిత్రం ఫేమ్ ఆనంది నాయకిగా నటించనున్నట్లు ఇంతకుముందు ఆయన వెల్లడించారు. తాజాగా ఇందులో మరో హీరోయిన్ పాత్రను త్రిష పోషించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అదే విధంగా బాలాజీమోహన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రం పూర్తి అయిన తర్వాత వేల్‌రాజ్ చిత్రంలో నటించనున్నారని సమాచారం.

0 comments:
Post a Comment