ప్రేమ, అభిమానం, ఇష్టం ఈ మూడు ఎప్పుడు, ఎలా? ఎవరిపై కలుగుతాయో ఎవరికి తెలియదు. అందరూ ఎవరో ఒకరిని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, ఇష్టపడతారు కూడా. అందుకు తగిన కారణాలు కూడా ఉంటాయి. ఇక కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన నటుల్లో శింబు ముందు వరుసలో ఉంటారు. అలాంటి నటుడు మనసుని ఆకట్టుకున్న వారి గురించి శింబు తన మనోగతాన్ని మన ముందుంచారు. అదేంటో ఆయన మాటల్లోనే...
దేవతామూర్తుల్లో కాళిమాతను పూజిస్తాను. కారణం ఆ దేవత కోపం, ఆక్రోశం నా మనస్సును కదిలిస్తాయి. ఇక మా అమ్మ ఉషారాజేంద్రన్ అంటే చాలా చాలా ఇష్టం. తన మనసులోని ప్రతి విషయాన్ని దాచకుండా నాతో పంచుకుంటారు. నా చెల్లెలి విషయాని కొస్తే నా చిత్రాలకు తొలి విమర్శకురాలు తనే. కొన్ని చిత్రాలను మెచ్చుకొంది. మరి కొన్ని చిత్రాలపై విమర్శల వర్షం గుప్పించింది. నా తమ్ముడు కురళరసన్, తను తరచు గొడవపడుతుంటాడు. అయితే నాతో గొడవ పడిన సందర్భాలు లేవు. నా చెల్లలంటే నాకు చాలా ప్రేమ.
ఇప్పుడామె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోయింది. ఇక నేను అమితంగా ప్రేమించే స్త్రీమూర్తి లతారజనీకాంత్. ఆమె నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిదనే చెప్పాలి. వారి ఆశ్రమ పాఠశాలలో మూడేళ్లు చదువుకున్నాను. ఆ సమయంలో ఎన్నో మంచి మాటలు, సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మరో విషయం ఏమిటంటే నాలోని నటన ప్రతిభ బహిర్గతం కావడానికి లతా రజనీకాంత్ కూడా కారణం. ఇక నన్ను బాగు ఆకట్టుకున్న స్త్రీమూర్తి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. ఆమె ఆత్మవిశ్వాసం స్ఫూర్తి నిచ్చింది. ఆమె అవసరమైన విషయాలను మాత్రమే మాట్లాడుతారు. ఆమె మాటల్లో స్పష్టత ఉంటుంది.
ఇక మీరు ఆశించిన విషయాలను కూడా చెబుతాను. నటి త్రిష నాకు బాల్య స్నేహితురాలు. అలై చిత్రంలో తొలిసారిగా కలిసి నటించాము. ఆ తర్వాత విన్నై తండి వరువాయా చిత్రంలో నటించాము. ఈ చిత్రంలో మా మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని ప్రశంసించారు. మేము కలిసి ఎక్కువగా చిత్రాలు చేయకపోయినా తరచు కలుసుకుంటాం. పార్టీలకు వెళుతుంటాం. నయనతార, హన్సికల గురించి ఏమి చెప్పమంటారు? వాళ్లపై నా ప్రేమ నిజమైనది అయితే దాన్ని వారు అర్థం చేసుకోకుండా మతం మార్చినంత సులభంగా మారిపోయారు అంటు నటుడు శింబు తన మనసులోని భావాలను వెల్లడించారు.

0 comments:
Post a Comment