ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి. ఆ చిత్రంలో ముఖ్య పాత్రని ప్రముఖ నటీ పూనమ్ కౌర్ పోషిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. రెండు రోజులు షూటింగ్ తర్వాత ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రకటించారని సమాచారం. కథ చెప్పిన సమయంలో టీనేజ్ కుర్రాడు అని చెప్పి... చిత్రంలో నటించే సమయంలో 10 ఏళ్ల వయస్సు గల ప్రణీత్ తో నటింప చేస్తారా అని రామ్ గోపాల్ వర్మను పూనమ్ కౌర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ అంశంపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. సావిత్రి పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు.
అందుకు సంబంధించిన పోస్టర్లు మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో మహిళ సంఘాలు వర్మపై నిప్పులు కక్కాయి. దాంతో వర్మ 'సావిత్రి'ని పక్కన పెట్టి శ్రీదేవి పేరును ఖరారు చేశాడు. ఆ చిత్రానికి శ్రీదేవి పేరు ఖరారు చేయడంపై ప్రముఖ నటీ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై శ్రీదేవి... రామ్ గోపాల్ వర్మకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసింది. అయినా తాను శ్రీదేవి పేరుతో చిత్రాన్ని నిర్మించి తీరుతానని వర్మ బహిరంగ ప్రకటన చేశారు. ఓ టీచర్, ఓ విద్యార్థి మధ్య నడిచే కథనాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0 comments:
Post a Comment