తొలినాళ్లలో ఆయన వస్త్రాలకు మోడల్ గా పనిచేశారు. అయితే, అందుకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తన స్నేహితుడి కోసం ఆయన ఈ పని చేశారు. కొన్ని నెలల పాటు ఆయన ఈ దుస్తులు వేసుకున్న ఫొటోలు నాగ్ పూర్ నగరం మొత్తం బాగా కనిపించాయి.
ఒకానొక సమయంలో లండన్ వెళ్లి న్యాయవిద్య చదవడం కోసం రాజకీయాలు వదిలేద్దామని దేవేంద్ర ఫడ్నవిస్ భావించారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేయాలన్నది ఆయన కల. కానీ, స్నేహితులు ఆపేయడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు.
దేవేంద్ర భార్య అమృత యాక్సిస్ బ్యాంకులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నాగ్ పూర్ లో పనిచేస్తున్న ఆమె.. ఇప్పుడు ముంబైకి బదిలీ చేయించుకుంటున్నారు.
ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉండబోయే అత్యంత పిన్నవయస్కురాలిగా దేవేంద్ర ఫడ్నవిస్ కుమార్తె దివిజ రికార్డు సృష్టించబోతున్నారు. ఆమెకు ఇప్పుడు ఐదేళ్లు మాత్రమే. ఇంతకుముందు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పిన్న వయస్కురాలిగా ఉండేవారు. సీఎం నివాసంలో ప్రవేశించేసరికి ఆమె వయసు తొమ్మిదేళ్లు.
0 comments:
Post a Comment