ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌కంటూ ప్రత్యేకంగా కొందరు భామలుండేవారు. అయితే ఇప్పుడు ఆ భామలకు దీటుగా కథానాయికలే అంగాంగ ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. ఇంతకుముందు ఈ ట్రెండ్ బాలీవుడ్‌లోనే ఉండేది. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ అంటూ అంతటా విస్తరించేసింది. ఇలాంటి పాటలకిప్పుడు అరకోటి వరకు ఈ ముద్దుగుమ్మలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లు శ్రుతిహాసన్, తమన్న, శ్రీయ లాంటి వారు సింగిల్ సాంగ్‌కు సై అంటున్నారు. తాజాగా జాబితాలో చెన్నై చిన్నది త్రిష చేరిందనే ప్రచారం హోరెత్తింది. నటిగా దశాబ్దం దాటిన ఈ మూడు పదుల భామ రేస్‌లో కాస్త వెనుకబడ్డారు.
అయినా అవకాశాలు మాత్రం అస్సలు లేకుండా పోలేదు. లేటెస్ట్‌గా కన్నడ చిత్ర రంగప్రవేశం చేసిన త్రిష తెలుగు చిత్రం దూకుడు రీమేక్‌లో పునిత్ రాజ్‌కుమార్‌తో రొమాన్స్ చేశారు. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకక్కడ చిత్ర పరిశ్రమలో క్రేజ్ వచ్చేసింది. అయితే ఆ క్రే జ్‌ను అక్కడ దర్శక నిర్మాతలు మరో విధంగా వాడుకోవాలని చూస్తున్నారని సమాచారం. అదేనండి ఐటమ్ సాంగ్స్‌తో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. తాజాగా నాన్‌ఈ ఫేమ్ సుదీప్ కన్నడంలో నటిస్తున్న తాజా చిత్రంలో త్రిషకు ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం సాగింది.
ఇది తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో రచితారామ్, హరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో ముంతాజ్ నటించిన ఐటమ్ సాంగ్‌ను కన్నడంలో త్రిష నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియూ ప్రచారం. ఇదే విధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలోను త్రిష సింగిల్‌సాంగ్‌కు చిందేయనున్నారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని త్రిష తల్లి ఉమ కొట్టిపారేశారు. అసలు త్రిషను ఐటమ్‌సాంగ్ చెయ్యమని తమ నెవరూ అడగలేదని ఆమె స్పష్టం చేశారు.

0 comments:
Post a Comment