నేను టెన్త్‌క్లాస్ చదువుతున్నప్పుడు మా దూరపు బంధువు ఒకరు భార్యాసమేతంగా వచ్చారు మా ఇంటికి. వాళ్లని చూస్తూనే అరుగు మీద కూర్చుని హోమ్‌వర్క్ చేస్తున్న నన్ను లోపలికి వెళ్లిపొమ్మన్నారు. దాంతో నాకేదో అనుమానం వచ్చింది. లోపల నిలబడి కిటికీలోంచి జరిగేది చూడసాగాను. ఆ వచ్చినావిడ అంటోంది... ‘నా కూతుర్ని నాకు ఇచ్చేయండి’ అని. నాన్న అంటున్నారు... ‘మొదటే చెప్పాం తననిక ఇవ్వడం కుదరదని, తనిప్పుడు నా కూతురు, మీరు వెళ్లిపోండి’ అని. నాకు ఎప్పటికో అర్థమైంది... వాళ్లు మాట్లాడుకుంటున్నది నా గురించే అని.
నాకు కోపం, దుఃఖం కలిసొచ్చేశాయి. అంటే నేను ఆయన కన్న కూతురిని కాదు. అందుకే ఆయనకు నా మీద ప్రేమ లేదు. అలా అనుకోగానే ఇక ఉండలేకపోయాను. పరుగు పరుగున మా అమ్మ దగ్గరకు వెళ్లిపోయాను. నన్నూ తీసుకుపొమ్మని అడిగాను. తను సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకుంది. అంతవరకూ వాళ్లతో వాదించిన నాన్న సెలైంట్ అయిపోయారు. వస్తానంటే తీసుకెళ్లండి అన్నారు. దాంతో నేను మా అమ్మానాన్నలతో వెళ్లిపోయాను. కానీ నేనెంత తప్పు చేశానో తర్వాత తెలిసింది.
0 comments:
Post a Comment