న్యూయార్క్: మానవ రహిత రాకెట్ ఆంటారెస్ ప్రయోగం విఫలం కావడంపై నాసా స్పందించింది. ఈ ప్రయోగం విఫలం కావడం వలన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. రాకెట్ లో సరిపడా ఆహారం, వస్తువులు శాస్త్రజ్క్షులకు అందుబాటులోకి ఉన్నాయని నాసా వెల్లడించింది.
ఈ రాకెట్ ప్రయోగం విఫలమైనంత మాత్రాన మా ప్రయోగాలో లోపం ఉందని చెప్పలేమని నాసా శాస్త్రజ్క్షులు అన్నారు. రాకెట్ ప్రయోగంలోని సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తామని నాసా తెలిపింది. వర్జీనియాలోని వాలోప్స్ ఐలాండ్ నుంచి ప్రయోగించిన మానవ రహిత రాకెట్ ఆంటారెస్ ప్రయోగించిన కొద్ది సెకన్లకే పేలిపోవడంపై విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేని నాసా ధృవీకరించింది.
0 comments:
Post a Comment