టీనగర్: ఆస్తి తగాదాకు సంబంధించి నటుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెరైక్టర్ భారతీరాజా ‘అలైగళ్ ఓయ్‌వదిల్లై’ అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైన నటుడు కార్తీక్ అనేక చిత్రాల్లో నటించారు. ఈయన కుమారుడు గౌతం కార్తీక్ కూడా ప్రస్తుతం చిత్ర నటుడిగా కొనసాగుతున్నారు. కార్తీక్‌కు అతని కుటుంబీకులకు మధ్య ఆళ్వారుపేటలోగల ఇల్లు, ఇతర స్థలాలకు సంబంధించి కొంతకాలంగా తగాదాలు వున్నాయి. ఈ కారణంగా కొన్ని రోజుల క్రితం కార్తీక్ హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన విడిగా వుంటున్నట్లు సమాచారం. ఈ క్రమం లో కార్తీక్ మంగళవారం రాత్రి తేనాంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒక ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఇందులో ఆస్తి తగాదా గురించిన వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ ఆస్తి తగాదాకు సంబంధించి కార్తీక్ అందజేసిన ఫిర్యాదుపై విచారణ జరుపనున్నట్లు తెలిపారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment