‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్‌తరుణ్, అవికా గోర్ మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. అంజిరెడ్డి, రూపేష్ డి.గోవిల్, బెక్కెం వేణుగోపాల్, రాజశేర్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘అవిక, రాజ్ తరుణ్‌ల మధ్య కెమిస్ట్రీని మరోసారి బ్రహ్మాండంగా ఆవిష్కరించే చిత్రమిది. కథ కోసమే ఎనిమిది నెలల సమయం కేటాయించాం. ప్రసన్నకుమార్ సంభాషణలు నవ్విస్తాయి. శేఖర్‌చంద్ర బాణీలు అలరిస్తాయి. అందరూ చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు. మళ్లీ కలిసి నటిస్తున్నందుకు హీరో హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment