విదేశీ బ్యాంకుల్లో వేల కోట్లలో సొమ్ము దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 627మంది పేర్లతో కూడిన ఈ జాబితాను మూడు సెట్లుగా కేంద్రం సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి అందించింది. ఈ నేపథ్యంలో నల్లధనంపై దేశంలో చోటుచేసుకున్న పరిణామాల కాలక్రమం ఒక్కసారి చూద్దాం...
18-04-2009 : పన్ను ఎగవేసి విదేశాల్లో నల్లధనం దాచిన భారతీయుల వివరాలు విడుదల చేస్తామని బీజేపీ ఓ బుక్ లెట్ విడుదల చేసింది.
19-01-2011 : దాదాపు 89.16 బిలియన్ డాలర్ల మేర భారతీయుల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉంది. ఆ ధనాన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు.
19-01-2011 : బ్లాక్ మనీపై ఎంసీ జోషి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీబీడీటీ కమిటీ కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది.
27-01-2012 : నల్ల కుబేరుల పేర్లు ఇచ్చిపుచ్చుకోవాలని జీ 20 దేశాలు తీర్మానించాయి. ఆ తీర్మానంపై సంతకాలు చేయాలని నిర్ణయించాయి.
14-11-2013 : తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని నాటి గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
01-02-2014: నల్లధనాన్ని వెనక్కి తెచ్చే విషయంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకుంటామని ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు.
21-02-2014 : నరేంద్ర మోడీకి దాదాపు రూ.400 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో వెల్లడించాలని ఆప్ నాయకులు బీజేపీని డిమాండ్ చేశారు.
26-03-2014 : బ్లాక్ మనీ వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రత్యేక రాయబారిని నియమిస్తామని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది.
27-04-2014 : నల్లధనం దాచిన కుబేరుల జాబితా వివరాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో భారత్, స్విట్జర్లాండ్ దేశాలు అధ్యాయనం చేయాలని నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు.
29-04- 2014 : లిచెస్టన్ బ్యాంకులో నల్లధనం దాచిన 26 మంది వివరాలను భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది.
02-06-2014 : విదేశాల్లో దాగి ఉన్న బ్లాక్ మనీని రప్పించేందుకు రిటైర్డు జడ్జీ ఎంబీ షా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించింది.
20-07-2014 : నల్లకుబేరుల జాబితా వివరాలు వెల్లడించాలని భారత్ చేసిన విజ్ఞప్తిపై స్విస్ బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రకటన చేశారు.
25-07-2014 : బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. నల్లధనం సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు.

18-10-2014: నల్లకుబేరుల జాబితాలోని వారి వివరాలను దాచిపెట్టేది లేదని జైట్లీ మరోసారి అన్నారు. అయితే సమగ్ర విచారణ తర్వాత మాత్రమే వాటిని వెల్లడిస్తామన్నారు.
26-10-2014 : ఒక కంపెనీ సహా మొత్తం 8 మంది నల్లకుబేరుల వివరాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది.
28-10-2014 : నల్లకుబేరుల పూర్తి జాబితాను సీల్డ్ కవర్లో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
29-10-2014 : మొత్తం 627 పేర్లతో కూడిన జాబితాను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

0 comments:
Post a Comment