Total Pageviews

అవన్నీ ఒక్క బ్యాంకులో ఖాతాలే!

అవన్నీ ఒక్క బ్యాంకులో ఖాతాలే!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు 627 మంది పేర్లతో కూడిన నల్ల కుబేరుల జాబితాను సమర్పించింది. అయితే.. అవన్నీ కూడా ఫ్రాన్స్ లోని హెచ్ ఎస్ బీసీ బ్యాంకులో ఉన్న ఖాతాల వివరాలు మాత్రమేనట. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, ఖాతా నెంబర్లు సహా.. ఏ ఖాతాలో ఎంతెంత మొత్తం ఉందన్న విషయాలు కూడా వివరంగా ఉన్నట్లు తెలిసింది.

అంటే.. ఇంకా స్విస్ బ్యాంకుల ఖాతాల్లో సొమ్ము వివరాలు, ఆయా ఖాతాలు కలిగి ఉన్నవాళ్ల పేర్లు ఇంతవరకు సుప్రీంకోర్టుకు కూడా చేరలేదు. ఇంకా చెప్పాలంటే, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఆయా పేర్లను సంపాదించిందో లేదో స్పష్టత లేదు. దుబాయ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లోని పలు ఖాతాల్లో కూడా భారీ మొత్తంలో డబ్బు దాచుకున్నారన్న కథనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి వివరాలు కూడా ఇంకా బయటకు వస్తే.. జాబితా మరింత పెద్దది కావడం ఖాయం.
Share on Google Plus

About nellore people puls

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment